ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి తేదీని నిర్ణయించిన సీఎం జగన్

  • డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ
  • డీ-పట్టాలు ఇవ్వాలని జగన్ ఆదేశం
  • అదే రోజు ఇళ్ల నిర్మాణాలను చేపట్టే యోచనలో ప్రభుత్వం
ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. కోర్టు స్టే వున్న ప్రాంతాలను మినహాయించి, ఇతర చోట్ల డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు డీ-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలాలను కేటాయించాలని చెప్పారు.

ఈ రోజు జిల్లా కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. అదే రోజున (డిసెంబర్ 25) ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే 30,68,281 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.


More Telugu News