నితీశ్ కు సీఎం పదవిని ఎందుకు త్యాగం చేశారు?: బీజేపీకి శివసేన ప్రశ్న
- మూడో స్థానంలో నిలిచిన నితీశ్ కి సీఎం పదవి ఇచ్చారు
- మహారాష్ట్రలో శివసేనకు ఆ పదవి ఎందుకు ఇవ్వలేదు?
- మీ త్యాగాల గురించి రాయడానికి సిరా సరిపోవడం లేదు
బీహార్ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధించిన నితీశ్ కుమార్ కు సీఎం పదవిని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో అంటూ బీజేపీపై శివసేన సెటైర్లు వేసింది. మహారాష్ట్రలో మంచి ఆధిక్యత సాధించిన శివసేనకు ఎందుకు సీఎం పదవిని ఇవ్వలేక పోయారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనాన్ని ప్రచురించింది.
బీజేపీ, జేడీయూల కలయిక ఎంత కాలం కొనసాగుతుందో అనే అనుమానాలను కూడా సామ్నా వ్యక్తం చేసింది. బీజేపీతో ఎంతో కాలంగా కలిసి ఉన్న శివసేనకు బీజేపీ సీఎం పదవిని ఇవ్వలేక పోయిందని... ఇదే సమయంలో బీహార్ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైన జేడీయూకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారని వ్యాఖ్యానించింది.
బీజేపీ ఔదార్యం చాలా గొప్పగా ఉందని ఎద్దేవా చేసింది. బీజేపీ చేసిన రాజకీయ త్యాగాల గురించి రాయడానికి ఇంకు (సిరా) కూడా సరిపోవడం లేదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శివసేన కాకుండా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నడిపిస్తున్నారంటూ వస్తున్న కథనాలకు సమాధానంగా... ఇప్పుడు బీహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో చూడాలని వ్యాఖ్యానించింది.