పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు: అమరావతి జేఏసీ నేత శివారెడ్డి

  • మా వినతికి పవన్ సానుకూలంగా స్పందించారు
  • అండగా ఉంటానని భరోసా ఇచ్చారు
  • మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం
అమరావతి జేఏసీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి జేఏసీ నేత శివారెడ్డి మాట్లాడుతూ, తమ వినతికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారని అన్నారు. అమరావతి ఉద్యమంలోకి అవసరమైన సమయంలో వస్తానని చెప్పారని తెలిపారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అమరావతికి మద్దతుగా ఢిల్లీలో లాంగ్ మార్చ్ చేయాలని గతంలో తాము భావించామని తెలిపారు. అమరావతి పోరాటానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించారు. అమరావతి కోసం తమ పోరాటం ఆగదని చెప్పారు.


More Telugu News