హైదరాబాద్ లో హై అలర్ట్... ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు!

  • ఎన్నికలు ముగిసేంత వరకూ ప్రత్యేక సెల్
  • స్పెషల్ బ్రాంచ్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో ఏర్పాటు
  • సమస్యలు తలెత్తకుండా చూస్తామన్న యంత్రాంగం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగానే, హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా, ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ను ప్రారంభించారు. స్పెషల్ బ్రాంచ్ సీపీ తరుణ్ జోషి, అదనపు సీపీ చౌహాన్ నేతృత్వంలో ఇది పని చేస్తుంది.

వచ్చే నెలలో ఫలితాలు వచ్చేంత వరకూ ఈ విభాగం కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఎక్కడికక్కడ బందోబస్తును పెంచాలని, గతంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన చోట్ల మరింత దృష్టిని సారించాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగివున్న వారంతా, వాటిని స్థానిక పోలీసు స్టేషన్లు లేదా, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News