కొవిడ్ టీకా విషయంలో క్రీడాకారులకు వెసులుబాటు ఇచ్చిన ఐఓసీ

  • టీకా వేయించుకోవాలా? వద్దా? అనేది వారి ఇష్టం
  • వ్యాక్సిన్ కొందరిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది
  • ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్
కొవిడ్ టీకా విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు కొవిడ్ టీకా వేయించుకోవడం తప్పనిసరేమీ కాదని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. వ్యాక్సినేషన్ విషయాన్ని క్రీడాకారుల ఇష్టానికే వదిలేసిన ఆయన.. టీకా వేయించుకోవాలా? వద్దా? అనేది వారే నిర్ణయించుకోవాలని అన్నారు.

ఒలింపిక్స్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాచ్ పేర్కొన్నారు. అంతేకాదు, వ్యాక్సిన్ ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపే అవకాశం ఉందని, కొందరిపై ఇది దుష్ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అన్నారు. టోక్యోలో ఒలింపిక్స్ ప్రధాన వేదిక అయిన నేషనల్ స్టేడియంతోపాటు క్రీడా గ్రామాన్ని బాచ్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సౌకర్యాలను పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News