జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ

  • డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
  • టీడీపీ పోటీ చేస్తుందని చెప్పిన రమణ
  • బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని వెల్లడి
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. 13 రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ ముగియనున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ క్లారిటీ ఇచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు కానీ, రేపు కానీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులు లేకుండానే ఈ ఎన్నికల్లో పోటీ  చేయబోతున్నామని తెలిపారు. అయితే అన్ని స్థానాల్లో కాకుండా కేవలం బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబేనని... నగరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు.


More Telugu News