ఇరాన్ అణుకేంద్రంపై దాడి చేయాలని భావించిన అమెరికా!
- ఇరాన్ చర్యల విషయంలో విసుగుచెందిన ట్రంప్
- అణ్వాయుధాలను పెంచుకుంటోన్న ఇరాన్
- సలహాదారుల సూచనలతో ఇరాన్‌పై దాడి వ్యూహం ఉపసంహరణ
ఇరాన్ చర్యల విషయంలో విసుగుచెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకోవాలనుకున్న ప్రతిచర్య గురించి అమెరికా అధికారి ఒకరు కీలక విషయం బయటపెట్టారు. వారం రోజుల క్రితం ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రం నటాంజ్‌పై దాడి చేయాలని ట్రంప్ ప్రణాళిక వేసినట్లు చెప్పారు. అయితే, సలహాదారుల సూచనల మేరకు ఆయన ఆ వ్యూహాన్ని ఉపసంహరించినట్లు తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి క్రిస్టోఫర్ మిల్లర్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లేతో కలిసి ట్రంప్ ఇటీవల ఓ సమావేశం నిర్వహించారు. దాడి చేస్తే ఇరాన్‌తో అమెరికాకు నెలకొన్న సమస్య మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ట్రంప్‌కు సలహాదారులు చెప్పారు.
దీంతో దాడి చేయాలన్న ఆ ఆలోచనను ట్రంప్ విరమించుకున్నారు. ఇరాన్‌పై దాడి చేయాలని గతంలోనూ ట్రంప్ ప్లాన్లు వేసుకుని వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇరాన్ తో న్యూక్లియర్ ఒప్పందం నుంచి తప్పుకుంటూ ట్రంప్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని ఆ సందర్భంగా ఆయన విమర్శించారు.
అలాగే, ఆ దేశంపై ఆంక్షలను విధించారు. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ సైట్ నుంచి అండర్‌గ్రౌండ్ సైట్‌లోకి అడ్వాన్స్‌డ్ సెంట్రిప్యూజ్‌లను తీసుకువెళ్లేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలియడంతో అణు కేంద్రంపై దాడి చేయాలని ఇటీవల ట్రంప్ భావించారు. ఇరాన్ వద్ద 2.4 టన్నుల శుద్దీకరించిన యురేనియం ఉంది.