కాంగ్రెస్‌లో కాకరేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు.. ఆత్మశోధనకు సమయమిదేనన్న కార్తి చిదంబరం
- 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రం గెలిచిన కాంగ్రెస్
- పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న సొంత పార్టీ నేతలు
- బీహార్ ఫలితాలపై చర్చించాల్సిందేనన్న కార్తి
బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో కాకరేపుతున్నాయి. ప్రజలు తమ పార్టీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ను వారు ప్రత్యామ్నాయ పార్టీగా భావించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా, ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై పార్టీలో చర్చించాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. పార్టీ పనితీరు విషయంలో ఆత్మశోధనకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఫలితంగా ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో 125 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. మహాకూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది.