విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు షాక్... పరువునష్టం కేసును కొనగిస్తున్నట్టు టీటీడీ పిటిషన్

  • 2018లో పరువునష్టం కేసు వేసిన టీటీడీ
  • కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ ఏడాది పిటిషన్
  • వెనక్కి తీసుకోవడం లేదంటూ ఈరోజు పిటిషన్
తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై వేసిన పరువునష్టం కేసును ఉపసంహరించుకోవడం లేదని టీటీడీ స్పష్టం చేసింది. రమణదీక్షితులు, విజయసాయిలపై ఉన్న కేసును టీటీడీ వెనక్కి తీసుకునేందుకు యత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో... ఈ అంశంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

ఇద్దరిపై ఉన్న పరువునష్టం కేసును కొనసాగిస్తామని తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి వద్ద ఈరోజు టీటీడీ పిటిషన్ దాఖలు చేసింది. 2018లో వేసిన పరువునష్టం కేసును కొనసాగిస్తామని పిటిషన్ లో తెలిపింది. కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు ఈ ఏడాది దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది.

పింక్ డైమండ్ తో పాటు, పలు అంశాలపై గతంలో విజయసాయిరెడ్డితో పాటు రమణదీక్షితులు గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. పదేపదే వారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీటీడీ పరువునష్టం దావా వేసింది. వీరిద్దరి వల్ల టీటీడీ పరువుకు భంగం కలిగిందని... ఇద్దరూ చెరో రూ. 100 కోట్ల వంతున పరువునష్టం కింద చెల్లించాలని టీటీడీ కోరింది.


More Telugu News