కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు

  • కేదార్ నాథ్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
  • విపరీతంగా కురుస్తున్న మంచు
  • నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలు
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ లు చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న 40 గదుల పర్యాటక అతిథిగృహానికి శంకుస్థాపన చేయడానికి వారు వెళ్లారు. కేదార్ నాథ్ లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఆ ప్రాంతం మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టు మారిపోయింది.

కార్యక్రమం పూర్తి కాగానే ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడి నుంచి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మళ్లీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు హెలికాప్టర్ సేవలను కొనసాగించే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడే ఆగిపోయారు.


More Telugu News