కార్తీకమాసమని చన్నీళ్లతో తలస్నానం చేయొద్దు: బాలకృష్ణ

  • కరోనా విజృంభిస్తోన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
  • అందరూ వేడి నీళ్లతో స్నానం చేయాలి
  • చల్లని నీళ్లతో తలస్నానం చేయాలని సలహాలిస్తుంటారు
  • వాళ్ల మాటలు ఎవ్వరూ వినొద్దు
కరోనా విజృంభిస్తోన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనలు చేశారు. ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలకృష్ణ  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్తీకమాసమని పొద్దున్నే లేచి చన్నీళ్లతో తలస్నానం చేయొద్దని చెప్పారు. అందరూ వేడి నీళ్లతో స్నానం చేయాలని, ఆవిరి పట్టాలని ఆయన చెప్పారు.

కార్తీకమాసం కాబట్టి పొద్దున్నే లేచి చల్లని నీళ్లతో తలస్నానం చేయాలని కొందరు సలహాలు ఇస్తుంటారని,  వాళ్ల మాటలు ఎవ్వరూ వినొద్దని బాలకృష్ణ చెప్పారు. కరోనా న్యుమోనియాకు సంబంధించినదని, అదొక లిపిడ్ ప్రొటీన్ అని తెలిపారు. అది మార్పులు చెందుతూ ఉంటుందని, అందుకే ఇప్పటి వరకు దానికి వ్యాక్సిన్ రాలేదని అన్నారు. అందరూ ఉప్పు నీరు, లేదా వేడి నీళ్లతో నోరు పుక్కిలించాలని, వీటిని పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కరోనా పోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన చెప్పారు.


More Telugu News