మ‌న‌వ‌రాలు ఆరాధ్యకు వెరైటీగా ‘బర్త్ డే’ విషెస్ చెప్పిన అమితాబ్!

  • ఆరాధ్య 9వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు 
  • ఏయే ఏడాదిలో ఆమె ఎలా ఉండేదో చూపిన బిగ్ బీ
  •  2011లో జన్మించిన ఆరాధ్య  
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్ తన మనవరాలు ఆరాధ్యకు సంబంధించి తొమ్మిది ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆమెకు తొమ్మిదో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏయే ఏడాదిలో ఆమె ఎలా ఉండేదో చూపారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వ‌ర్య‌రాయ్‌ల కూతురే ఆరాధ్య.  2011లో ఆరాధ్య జ‌న్మించింది. తల్లితో పాటు పలు కార్యక్రమాలకు వెళ్తూ ఆమె కూడా చిన్నప్పటి నుంచే మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎయిర్ పోర్టుల్లో, పలు కార్యక్రమాల్లో అచ్చం తన తల్లిలా ఫొటోలకు ఆమె పోజులిస్తూ కనపడుతుంది. కాగా, అమితాబ్ బ‌చ్చ‌న్ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. ఆయనకు వాటిల్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలావుంచితే, త్వరలో ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న మూవీలో అమితాబ్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు.  ప్ర‌స్తుతం ఆయన కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.


More Telugu News