దేశంలో మరో 30,548 మందికి సోకిన కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127
- మృతుల సంఖ్య 1,30,070
- కోలుకున్న వారు 82,49,579 మంది
- మొత్తం 12,56,98,525 కరోనా పరీక్షలు
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,548 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,851 మంది కోలుకున్నారు.
గడచిన 24 గంటల సమయంలో 435 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,070 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,49,579 మంది కోలుకున్నారు. 4,65,478 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,56,98,525 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,61,706 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.