కోహ్లీపై నెటిజన్ల తిట్ల కాలుష్యం!
- దీపావళికి టపాసులు కాల్చొద్దన్న కోహ్లీ
- కాలుష్యం పెంచొద్దని విజ్ఞప్తి
- నువ్వో కుక్కవి కాబట్టే కాల్చొద్దంటున్నావని నెటిజన్లు ఫైర్
- కోహ్లీకి మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేత
పర్యావరణ హితం కోరి దీపావళి నాడు టపాసులు కాల్చవద్దని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కోహ్లీని నెటిజన్లు కుక్కతో పోల్చారు. 'నువ్వో కుక్కవి కాబట్టే టపాసులు కాల్చవద్దంటున్నావు' అంటూ మండిపడ్డారు. అయితే, కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఈ విషయంలో స్పందించారు.
"నిజమే కోహ్లీ ఓ కుక్కే. అనుష్క శర్మ పెంచుకుంటున్న కుక్క. కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు ఇంకేముంటుంది? టపాసులు పేల్చి కాలుష్యం పెంచవద్దని, తద్వారా మానవ మనుగడను దెబ్బతీయొద్దని కోహ్లీ మీకు చెప్పాడు. కానీ మీరు అజ్ఞానులు. కోహ్లీ చెప్పింది మీలాంటి మూర్ఖులకు అర్థంకాలేదు. మీరోసారి మీ డీఎన్ఏ చెక్ చేయించుకోండి. మీరు ఇక్కడివాళ్లో, ఇంకెక్కడి వాళ్లో తెలుస్తుంది. మీ మూలాల గుట్టురట్టవుతుంది" అని ఘాటుగా స్పందించారు.
ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదంటూ ఉదిత్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీపై ఇంత విషం చిమ్ముతున్నా మౌనంగా ఉండడమేంటని ప్రశ్నించారు.