దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత సౌమిత్ర చటర్జీ కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛటర్జీ
- కోల్ కతా బెల్లెవ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఛటర్జీ వయసు 85 సంవత్సరాలు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్ కతాలోని బెల్లెవ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సౌమిత్ర ఛటర్జీ నటుడిగానే కాకుండా, కవిగా, రచయితగా, చిత్రకారుడిగా పేరుతెచ్చుకున్నారు. 2012లో ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా జాతీయస్థాయిలో విశిష్టత కలిగిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. సౌమిత్ర ఛటర్జీ 1935 జనవరి 19న కోల్ కతాలో జన్మించారు. బెంగాల్ చిత్ర పరిశ్రమలో నటదిగ్గజంగా పేరుగాంచిన ఆయనకు కేంద్రం 2004లో పద్మభూషణ్ ప్రదానం చేసింది.
కాగా, సౌమిత్ర ఛటర్జీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం ప్రపంచ చిత్రసీమకు అపారనష్టం అని పేర్కొన్నారు. బెంగాల్ సాంస్కృతిక జీవనానికే కాకుండా భారతదేశానికి కూడా ఆయన మృతి తీరనిలోటు అని అభివర్ణించారు.