మళ్లీ నితీశ్ కుమారే సీఎం... బీహార్ లో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
  • పాట్నాలోని నితీశ్ నివాసంలో సమావేశమైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు
  • నితీశే తమ నేతగా ఎన్నుకున్నవైనం
  • నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్న నితీశ్
బీహార్ లో మరోసారి నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో నితీశ్ కుమార్ ను బీహార్ లో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన మరోసారి సీఎం కానున్నారు. ఆయన సీఎం పీఠంపై కూర్చోనుండడం ఇది నాలుగో పర్యాయం.

బీహార్ రాజధాని పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసంలో ఇవాళ ఎన్డీయే శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ నేతగా నితీశ్ కుమార్ నే ఎన్నుకున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 125 స్థానాలు గెలుచుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూడిన మహాఘట్ బంధన్ కూటమిని ఓడించింది.


More Telugu News