క్లీనర్‌ను రాడ్డుతో కొట్టి చంపి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన డ్రైవర్
- ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
- కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్
- పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తూ ఘర్షణ
క్లీనర్‌ను ఓ లారీ డ్రైవర్ ఇనుపరాడ్‌తో కొట్టడమే కాకుండా కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం తన లారీలో ఆ మృతదేహాన్ని వేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీలో పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో క్లీనర్ రాజును డ్రైవర్ నైఫ్‌రాజు రాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఈ విషయం తెలిపాడు. హత్య చేసి ఆ మృతదేహాన్ని లారీలోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. గొడవపడ్డ క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికే క్లీనర్‌ను హత్య చేశానని డ్రైవర్ అంటున్నాడు. క్లీనర్ కత్తితో తనను హత్య చేయాలని చూడడంతో తానే పొడిచేశానని చెప్పాడు.