ట్రంప్‌పై దావాను ఉపసంహరించుకోనున్న టిక్‌టాక్ ఉద్యోగి
- టిక్‌టాక్‌పై నిషేధంతో ట్రంప్ ప్రభుత్వంపై దావా
- కేసును కొట్టివేయాలంటూ ఇప్పుడు దరఖాస్తు
- కారణాలు వెల్లడించని వైనం
షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించినందుకు గాను ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసిన టిక్‌టాక్ ఉద్యోగి వెనక్కి తగ్గారు. ఇప్పుడా దావాను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 13న పాట్రిక్ ఎస్.ర్యాన్ కోర్టుకు దరఖాస్తు చేశారు. కేసును కొట్టివేయాలని ఇరు పక్షాలు కోరుతున్నట్టు అందులో పేర్కొన్నారు.
అయితే, దావాను వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారన్న కారణం మాత్రం తెలియరాలేదు. కాగా, అమెరికాలోని ఆస్తుల విక్రయానికి టిక్‌టాక్ యజమాన్యం బైట్‌డ్యాన్స్‌కు ఈ వారం మరో 15 రోజుల గడువు లభించింది. నిషేధం నేపథ్యంలో అమెరికాలో టిక్‌టాక్ ముందుకు సాగడం కష్టమని అమెరికా వాణిజ్య విభాగం తేల్చి చెప్పింది.