సింగిల్ చేప రూ.4.48 లక్షలు... జాక్ పాట్ కొట్టిన పశ్చిమ బెంగాల్ మత్స్యకారుడు

  • బెంగాల్, ఒడిశా సరిహద్దుల్లో చేపల వేట
  • మత్స్యకారుడి వలలో చిక్కిన 28 కిలోల చేప
  • వేలంలో కిలో రూ.16 వేలు ధర పలికిన వైనం
సముద్రాల్లో అపార మత్స్యరాశి ఉంటుంది. లక్షల జాతుల చేపలకు సముద్రాలు ఆవాసాలు. చేపల్లో కొన్ని తినడానికి యోగ్యమైనవి కాగా, మరికొన్ని చేపల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అలాంటి చేపలకు విపరీతమైన ధర పలుకుతుంది. తాజాగా అలాంటిదే ఓ అరుదైన చేప పశ్చిమ బెంగాల్ మత్స్యకారుడి వలకు చిక్కింది.

జలేశ్వర్ కు చెందిన ఓ జాలరి పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సముద్రంలో వేటకు వెళ్లగా, 'తెలియా భేక్టి' అనే చేప వలలో పడింది. ఆ చేపలోని కొన్ని భాగాలతో ఔషధాలు తయారుచేస్తారు. దాంతో ఆ చేపను వేలం వేశారు. చేప బరువు 28 కేజీలు కాగా, కిలో రూ.16 వేల ధర పలికింది. ఆ విధంగా రూ.4.48 లక్షలు వచ్చిపడ్డాయి. ఏఎంఆర్ సంస్థ ఆ 'తెలియా భేక్టి' చేపను వేలంలో దక్కించుకుంది. ఒక్క చేపతో లక్షాధికారి అయిన ఆ బెంగాల్ మత్స్యకారుడు ఆనందంలో మునిగితేలుతున్నాడు.


More Telugu News