నిన్న రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి ఆదాయం
- శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు
- రూ.1.50 కోట్లు సమర్పించిన అజ్ఞాత భక్తుడు
- కొండపై పెరుగుతున్న భక్తుల సంఖ్య
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి హుండీ నిన్న కళకళలాడింది. నిన్న ఒక్కరోజే రూ.3.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం. కరోనా వ్యాప్తి మొదలయ్యాక కొన్నిరోజులపాటు దర్శనాలు నిలిచిపోగా, తిరుమల క్షేత్రం మళ్లీ తెరుచుకున్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే ప్రథమం. ఓ అజ్ఞాత భక్తుడు ఒక్కడే రూ.1.50 కోట్లు స్వామివారి హుండీలో వేశాడు.
దీపావళి రోజులు కావడంతో గత కొన్నిరోజులుగా తిరుమల వెంకన్న క్షేత్రంలో భక్తుల సందడి పెరిగింది. పునఃప్రారంభం తర్వాత భక్తుల రాక తగ్గినా, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజా రవాణా కూడా ఊపందుకోవడంతో కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న తిరుమల వెంకన్నను 22,462 మంది దర్శించుకున్నారు.