స్వరూపానంద స్వామికి, ప్రభుత్వానికి ఏమి సంబంధం?: వర్ల రామయ్య
- జన్మదిన వేడుక ప్రభుత్వం చేస్తుంది
- రేపు ఇతర మత పెద్దల జన్మదిన వేడుకలూ నిర్వహిస్తుందా?
- ఎందుకు ఇలా తప్పుటడుగులు వేస్తున్నారు?
- మతముల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడితే ఎలా?
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుక సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ చర్యతో మతముల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడితే ఎలా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.
‘స్వరూపానంద స్వామికి, ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఈ రోజు ఆయన జన్మదిన వేడుక ప్రభుత్వం చేస్తే, రేపు ఇతర మత పెద్దల జన్మదిన వేడుకలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందా? ఎందుకు ఇలా తప్పుటడుగులు వేస్తున్నారు? మతముల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడితే ఎలా? మనది 'సెక్యులర్ స్టేట్' అని గుర్తుందా?’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వర్ల రామయ్య.