రావణుడిపై రాముడు విజయం సాధించినట్లు.. మనం కరోనాపై విజయం సాధించాలి: యూకే ప్రధాని
- దీపావళి శుభాకాంక్షలు
- చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి
- ప్రజలకు శక్తిమంతమైన సందేశాన్నిస్తోంది
- ఎల్లప్పుడూ చెడుపై మంచి గెలుస్తుంది
ప్రపంచంలోని పలు దేశాలలో వున్న భారతీయులు ఈ రోజు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న నేపథ్యంలో ఆ వైరస్ ను తొలగించాలని ఈ దీపావళి సందర్భంగా తాము కోరుకుంటున్నామని పలు దేశాల నేతలు చెప్పారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు ప్రిన్స్ చార్లెస్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తమ సందేశాలను అందించారు.
చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని వారు అన్నారు. ఈ దీపావళి ప్రజలకు శక్తిమంతమైన సందేశాన్నిస్తోందని ఆయన చెప్పారు. శ్రీ రాముడు.. రావణుడిపై విజయం సాధించినట్లు చీకటిపై వెలుతురు విజయం సాధించినట్లు, ఎల్లప్పుడూ చెడుపై మంచి గెలుస్తుందని బోరిస్ జాన్సన్ తెలిపారు.
అజ్ఞానంపై జ్ఞానం గెలిచినట్లే కరోనాపై ప్రజలు గెలుస్తారని, ఆ నమ్మకం తనకు ఉందని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీపావళి సందేశం నుంచి ప్రతిఒక్కరం స్ఫూర్తిపొందాలని ఆయన చెప్పారు. దీపావళి కాంతులు ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.
శుభాకాంక్షలు తెలుపుకొంటూ సంతోషంగా గడపాల్సిన ఈ సమయాన్ని కరోనా కారణంగా ఆంక్షల మధ్య జరుపుకోవాల్సి వస్తోందని ప్రిన్స్ చార్లెస్ అన్నారు. ఇది నిరాశకు గురిచేసే విషయమైనప్పటికీ, పండుగ అందించే సందేశంతో స్ఫూర్తిని పొందాలని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సమాజ సేవకు ముందుకు వచ్చిన యూకేలోని హిందూ, సిక్కు, జైన వర్గాలను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. ఈ పండుగను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు పలు దేశాల నేతలు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.