మైఖేల్ జాక్సన్ చనిపోయినా రారాజే... మరణానంతరం రాయల్టీ రూపంలో వేల కోట్ల ఆదాయం!
- 2009లో మరణించిన మైఖేల్ జాక్సన్
- రాయల్టీలు, ఆల్బమ్ హక్కుల రూపంలో భారీగా డబ్బు
- 11 ఏళ్లలో రూ.14,723 కోట్లు
ప్రపంచ పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లు అవుతోంది. అయినా, ఆయన పేరిట ఇప్పటికీ వేల కోట్ల ఆదాయం వచ్చిపడుతూనే ఉంది. 2009లో జూన్ 25న మైఖేల్ జాక్సన్ కన్నుమూశాడు. చనిపోయేనాటికి 400 మిలియన్ డాలర్ల మేర అప్పులు ఉన్నా, ఇప్పుడవన్నీ తీరిపోయాయి. జాక్సన్ సజీవుడిగా లేకపోయినా అది సాధ్యమైంది. ఎందుకుంటే ఆయన సంగీత సామ్రాజ్యాన్ని శాసిస్తున్న సమయంలో మ్యూజిక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలే అందుకు కారణం.
తన పాటలపై వచ్చే రాయల్టీలు, ఆల్బమ్ లపై హక్కులు, లైసెన్సింగ్ ఒప్పందాల రూపేణా భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కొన్ని దుస్తులు, యాక్సెసరీస్ కంపెనీలు మైఖేల్ జాక్సన్ పేరును ఉపయోగించుకుంటూ ఇప్పటికీ లబ్దిపొందుతుండడంతో వాటి నుంచి కూడా డబ్బు ప్రవహిస్తోంది. జాక్సన్ మరణించి 11 ఏళ్లు కాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.14,723 కోట్లు అంటే కింగ్ ఆఫ్ పాప్ హవా ఏమిటో మనకు అర్థమవుతుంది.
కాగా ఈ ఆదాయంలో జాక్సన్ ముగ్గురు పిల్లలకు, జాక్సన్ తల్లి కేథరిన్ కు భాగం ఉంది. ఏదేమైనా, జాక్సన్ అంటే జాక్సనే. ఇప్పుడున్న పాశ్చాత్య సంగీతకారుల్లో మరెవరికీ ఈ స్థాయిలో ఆదాయం లేదంటే అతిశయోక్తి కాదు.