స్వరూపానంద జన్మదిన వేడుకలు నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు
- ఈనెల 18న విశాఖ స్వరూపానంద జన్మదినం
- ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
- ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ అదనపు కమిషనర్
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకలు ఈనెల 18న జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ విషయమై శారదా పీఠం ప్రభుత్వానికి రాసిన లేఖ నేపథ్యంలో సర్కారు ఆయా ఆలయాల ఈవోలకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.