పాక్ ఆయుధ బంకర్లను తుత్తునియలు చేసిన భారత సైన్యం... వీడియోలు ఇవిగో!
- సరిహద్దుల్లో కాల్పులు జరిపిన పాక్
- దీటుగా తిప్పికొడుతున్న భారత్
- పాక్ బంకర్లు, చమురు నిల్వల గిడ్డంగులపై మిసైల్ దాడులు
ఇవాళ పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టడమే కాదు, పాక్ కు మతిపోయేలా వారి ఆయుధ బంకర్లను నాశనం చేసింది. ఈ బంకర్ల ధ్వంసానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పాక్ సైన్యానికి చెందిన ఆయుధ బంకర్లనే కాదు, చమురు నిల్వల గిడ్డంగులను, ఉగ్రవాదుల చొరబాట్లకు అనువుగా ఉండే ప్రాంతాలను భారత భద్రతా బలగాలు తుత్తునియలు చేశాయి.
దవార్, నౌగామ్, యూరి, కేరన్ సెక్టార్లలో భారత బలగాలకు, పాక్ రేంజర్లకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే భారత్ స్వల్ప దూరం ప్రయోగించే వీలున్న క్షిపణులతో పాక్ బంకర్ల పనిబట్టింది. కాగా, ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు భారత సైనికాధికారులు తెలిపారు.