దీపావళి వేడుకను ప్రధాని మోదీ ఎక్కడ జరుపుకోనున్నారంటే..?
- సైనికుల మధ్య దీపావళి జరుపుకోనున్న మోదీ
- పీఎం అయినప్పటి నుంచి ఇదే ఆనవాయతీ
- గుజరాత్ లో కానీ, రాజస్థాన్ లో కానీ వేడుకలు
గత కొన్ని నెలలుగా కరోనా చీకట్లలో గడిపిన మన దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వ్యవస్థ మొత్తం మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు దీపావళి వస్తోంది. అన్ని చోట్ల అప్పుడే దీపావళి హుషారు నెలకొంది. బాణసంచాను పక్కనపెట్టి, దీపాల వెలుగులో దీపావళిని చేసుకోవడానికి చిన్నా, పెద్దా సిద్ధమవుతున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఈ దీపావళిని సైనికుల మధ్య జరుపుకోనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి జవాన్ల మధ్య ఆయన దీపావళి జరుపుకుంటుండటం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఎక్కడ జరుపుకోబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
గుజరాత్ లో సైనికులతో కలసి పండుగ జరుపుకుంటారని కొందరు చెపుతుండగా... రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుపుకుంటారని మరికొందరు చెపుతున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉంటారు.
గత ఏడాది దీపావళికి జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో దీపావళిని మోదీ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పహారా కాసే సైనికులతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు.