జో బైడెన్ విజయాన్ని గుర్తిస్తూ... అమెరికా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన చైనా!

  • అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్
  • అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు
  • ఎట్టకేలకు మౌనం వీడిన చైనా
  • ప్రకటన చేసిన చైనా విదేశాంగ శాఖ
అమెరికా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన జో బైడెన్ అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా విజయం సాధించినా, ఆసియా పెద్దన్న చైనా ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించలేదు. అయితే తాజాగా చేసిన ఓ ప్రకటనలో జో బైడెన్ విజయాన్ని గుర్తించింది.

అమెరికా ప్రజల తీర్పును చైనా గౌరవిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ తెలిపారు. జో బైడెన్, కమలా హారిస్ లకు శుభాకాంక్షలు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను అమెరికా చట్టాల ప్రకారం నిర్ధారిస్తారని భావిస్తున్నాం అని వెన్ బిన్ పేర్కొన్నారు.

కాగా, ట్రంప్ హయాంలో అమెరికాతో చైనా వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. బైడెన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో చైనాతో అమెరికా వాణిజ్య వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంలో వేచిచూసే ధోరణి అవలంబించాలని చైనా అధినాయకత్వం భావిస్తోంది.


More Telugu News