లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 29 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ బజాజ్ ఫిన్ సర్వ్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. అనంతరం ట్రేడింగ్ ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ చివర్లో పుంజుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 43,443కి పెరిగింది. నిఫ్టీ 29 పాయింట్లు పుంజుకుని 12,720 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.32%), టాటా స్టీల్ (2.82%), యాక్సిస్ బ్యాంక్ (1.81%), బజాజ్ ఫైనాన్స్ (1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.21%).

టాప్ టూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.04%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.94%), భారతి ఎయిర్ టెల్ (-0.79%), టెక్ మహీంద్రా (-0.53%).


More Telugu News