అల్జీమర్స్‌తో బాధపడ్డ బామ్మ.. మర్చిపోయిన డ్యాన్స్‌ను గుర్తు చేసిన మ్యూజిక్.. వీడియో వైరల్
- యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె బెల్లీ డ్యాన్సర్
- చివరిరోజుల్లో కుర్చీకే పరిమితమైన బామ్మ
- మ్యూజిక్‌కు అనుగుణంగా చేతులను కదిలిస్తూ డ్యాన్స్
యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె బెల్లీ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించేది. తన డ్యాన్స్ తో అందరిలోనూ ఉత్సాహాన్ని కలిగించేది. అయితే, వయసు పెరగడంతో ఆమెకు అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. దాంతో ఆ మతిమరుపుతో ఏవీ గుర్తుకొచ్చేవి కావు.
అయితే, ఓరోజు ఆమె వద్ద మ్యూజ్ ఆన్ చేసి పెట్టడంతో అప్పట్లో తాను చేసిన డ్యాన్స్ ఆమెకు గుర్తుకు వచ్చింది. మ్యూజిక్‌కు అనుగుణంగా చేతులను కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. అమెరికాకు చెందిన మాజీ డ్యాన్సర్ మార్తా (60)కు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గత ఏడాదే తీసినప్పటికీ తాజాగా ఒకరు సామాజిక మాధ్యమాల్లో దాన్ని పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. అనారోగ్య కారణాలతో మార్తా నిరుడు కన్ను మూసింది. ఆమె చివరి డ్యాన్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చలనం లేని వారిని కూడా కదిలించే శక్తి మ్యూజిక్, డ్యాన్స్ కి ఉందని అంటున్నారు.