రూ. 10 కోట్లు తీసుకున్న 'చీర్ లీడర్' మ్యాక్స్ వెల్...: వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్!

  • రూ.10 కోట్లకు పైగా పెట్టి కొన్న కేఎక్స్ ఐపీ
  • ఈ సీజన్ లో చాలా బ్యాడ్ రికార్డు
  • 13 మ్యాచ్ లు ఆడి 108 పరుగులు మాత్రమే
  • వికెట్లు కూడా తీయకపోవడంతో సెహ్వాగ్ సెటైర్లు
ఈ ఐపీఎల్ సీజన్ లో కోట్లు వెచ్చించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసిన మ్యాక్స్ వెల్, అనుకున్నంతగా రాణించకపోవడంతో, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశారు. ఈ సీజన్ లో మ్యాక్స్ వెల్ రూ. 10 కోట్లు తీసుకున్న చీర్ లీడర్ గా మాత్రమే మిగిలిపోయాడని అన్నారు.

ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. "గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ. 10 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగోలు చేసింది. గత కొన్ని సీజన్లలో అతనికి చాలా బ్యాడ్ రికార్డు ఉంది. ఈ సీజన్ లో అతనికి డబ్బులు వచ్చాయిగానీ, అభిమానులకు ఆనందం మాత్రం మిగల్లేదు" అని అన్నారు.

"ఎంతో చెల్లించి మ్యాక్స్ వెల్ కు విశ్రాంతి ఇచ్చినట్లయింది" అని కూడా తన వీడియోలో సెహ్వాగ్ అన్నారు. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడన్న సంగతి తెలిసిందే. తన బౌలింగ్ లో 3 వికెట్లను మాత్రమే పడగొట్టాడు.

మ్యాక్స్ వెల్ పై మాత్రమే కాదు... డేల్ స్టెయిన్ పైనా సెహ్వాగ్ సెటైర్లు వేశారు. "డేల్ స్టెయిన్ ను చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. అయితే, స్టెయిన్ గన్ పేలలేదు. అది ఇండియాలో తయారు చేసిన పైప్ గన్ లా మారిపోయింది" అని అన్నారు.స్టెయిన్ ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడు మ్యాచ్ లు ఆడి, కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే తీశాడు.

ఇక ఆర్సీబీ తరఫున ఆడిన ఆరోన్ ఫించ్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన షేన్ వాట్సన్, కోల్ కతా కొనుగోలు చేసిన ఆండ్రీ రసెల్ తదితరుల విఫలంపై కూడా సెహ్వాగ్ స్పందించారు. ఇక జస్ ప్రీత్ బుమ్రా, కాసిగో రబడా, జోఫ్రా ఆర్చర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై మాత్రం ప్రశంసలు కురిపించారు.


More Telugu News