దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెచ్చిన కృనాల్ పాండ్యా... ఎయిర్ పోర్టులో నిలిపివేత!

  • ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడిన కృనాల్ పాండ్యా
  • ముందుగా తెలియజేయకుండా బంగారం, విలువైన వస్తువులు
  • ఎయిర్ పోర్టులోనే ఆపేసిన డీఆర్ఐ అధికారులు
ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన కృనాల్ పాండ్యా, తిరిగి ఇండియాకు వస్తూ, ముందుగా తెలియజేయని బంగారం, ఇతర విలువైన వస్తువులు తెచ్చాడు. దీంతో కృనాల్ ను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

పరిమితికి మించిన బంగారం అతని వద్ద ఉన్నదని, ఇన్ వాయిస్ లు లేని పలు విలువైన వస్తువులు కూడా అతని వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఐపీఎల్ ఫైనల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడిన ముంబై ఇండియన్స్ జట్టు, విజయం సాధించడంతో పాటు ఐదోసారి టైటిల్ ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే.

ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సీరీస్ కు ఎంపికైన ఆటగాళ్లు, ఆ దేశానికి చేరుకోగా, మిగిలిన వాళ్లు, పలు విమానాల్లో దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. కృనాల్ వద్ద లభించిన వస్తువుల గురించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు.


More Telugu News