కేంద్రం నుంచి ఎక్కువ రుణం తీసుకున్న రాష్ట్రం తెలంగాణే: కిషన్ రెడ్డి

  • తెలంగాణకు కేంద్రం ఉదారంగా సాయం చేస్తోందని వెల్లడి
  • గొర్రెల పథకానికి కేంద్రమే సబ్సిడీ ఇస్తోందని వివరణ
  • కొత్త వ్యవసాయ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలన్న కిషన్ రెడ్డి
తెలంగాణ సర్కారుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ రుణం తీసుకున్న రాష్ట్రం తెలంగాణే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో గొర్రెల పథకానికి కేంద్రం సబ్సిడీ, రుణసాయం అందిస్తోందని వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ఉదారంగా రుణసాయం చేస్తోందని చెప్పారు.

రైతుబంధు పథకం ఇవ్వబోమని హెచ్చరించడం వల్లనే రైతులు సన్నాలు పండించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 226 కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు రైతు అకౌంట్ లోనే డబ్బులు వేస్తామని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టం అమలు చేసి ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించి ఉండేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.


More Telugu News