ఇండియాలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్న పబ్జీ
- పబ్జీ ఇండియా మొబైల్ ను ప్రారంభించనున్న పబ్జీ
- పూర్తి డేటా భద్రతను పాటిస్తామని వెల్లడి
- 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచన
సరిహద్దుల వద్ద చైనాతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 116 యాప్స్ ను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉంది. అక్టోబర్ 30 నుంచి పబ్జీ తన కార్యకలాపాలను పూర్తిగా ఆపేసింది. అయితే భారత్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ యత్నిస్తోంది. త్వరలోనే పబ్జీ మొబైల్ ఇండియాను లాంచ్ చేయనున్నట్టు తెలిపింది.
భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి డేటా భద్రతతో గేమ్ ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే స్టోరేజీ సిస్టమ్స్ పై ఎప్పటికప్పుడు ఆడిట్, వెరిఫికేషన్స్ నిర్వహిస్తామని చెప్పింది. యువ ఆటగాళ్ల కోసం ఆట సమయాన్ని కూడా పరిమితం చేస్తామని తెలిపింది. ఇండియాలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని పబ్జీ కార్పొరేషన్, దాని మాతృ సంస్థ క్రాఫ్టన్ లు యోచిస్తున్నాయి.