అన్నవరం హుండీ లెక్కింపులో పురోహితుడి చేతివాటం... శాశ్వతంగా వేటు వేసిన అధికారులు
- అన్నవరం ఆలయంలో ఘటన
- రూ.11 వేలు నగదు ఎత్తుకెళుతున్న పురోహితుడు
- తనిఖీల్లో పట్టుకున్న ఆలయ భద్రతా సిబ్బంది
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుని ఆలయంలో పురోహితుడి చేతివాటం వెల్లడైంది. ఆలయ హుండీ లెక్కింపులో పురోహితుడు శ్రీనివాస శర్మ నగదు, కానుకలు కొట్టేస్తున్నట్టు గుర్తించారు. ఈ పురోహితుడు హుండీ నుంచి రూ.11 వేల వరకు నగదు తీసుకెళుతుండగా ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో పురోహితుడు శ్రీనివాస శర్మను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.