మందులకు తగ్గే జబ్బులకు కూడా శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు.. 465 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

  • అమెరికా వైద్యుడి ధనాశ
  • అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు
  • ఫిర్యాదు చేసిన మహిళలు
అమెరికాలోని ఓ డాక్టర్ కు భారీగా జైలు శిక్ష పడింది. ఆ డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్. వర్జీనియాలో ఉండే ఈ వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేసేవాడు. మందులకు జబ్బు తగ్గే అవకాశం ఉన్నా ఆపరేషన్ చేయాలని చెప్పేవాడు. ఎక్కువగా గర్భసంచి సంబంధిత శస్త్రచికిత్సలు చేసేవాడు. ఈ విధంగా పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్టు గుర్తించారు.

ఓ డాక్టర్ 10 ఏళ్ల కాల వ్యవధిలో 7.63 శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేస్తారనుకుంటే, వర్జీనియా వైద్యుడు జావేద్ పర్వేజ్ మాత్రం 41.26  శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేశాడు. డబ్బు కోసం ఆశపడి ఈ విధంగా వ్యవహరించినట్టు తేలింది. ఆపరేషన్ల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు రాబట్టాడు. ఈ డాక్టర్ పై 29 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో అతడి దురాశ నిజమేనని వెల్లడైంది. దాంతో వర్జీనియా న్యాయస్థానం అన్ని అభియోగాలను నిజమేనని నిర్ధారించి 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


More Telugu News