టీమిండియాకు కొత్త యూనిఫాం... 90వ దశకం నాటి డిజైన్ తో నయా జెర్సీలు!

  • నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన
  • డార్క్ బ్లూ కలర్ లో కొత్త జెర్సీలు
  • ఇటీవలే ఎంపీఎల్ స్పోర్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
ఐపీఎల్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆస్ట్రేలియాలో భారత పర్యటనపై పడింది. భారత్ ఆసీస్ గడ్డపై 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు, 4 టెస్టులు ఆడనుంది. నవంబరు 27 నుంచి పర్యటన షురూ కానుంది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కొత్త జెర్సీల్లో కనువిందు చేయనుంది. ఇప్పటివరకు లైట్ బ్లూ కలర్ లో దర్శనమిచ్చిన టీమిండియా ఇకపై డార్క్ బ్లూ కలర్ యూనిఫాంలో కనిపించనుంది. 90వ దశకంలో భారత ఆటగాళ్లు ఇలాంటి ముదురు రంగు జెర్సీలనే ధరించేవారు.

తాజాగా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ అలనాటి డిజైన్ తో భారత జాతీయ జట్టు క్రికెటర్ల కోసం కొత్త జెర్సీలు రూపొందించింది. అంతేకాదు, మ్యాచ్ విరామాల్లో ధరించేందుకు అనువైన దుస్తులతో పాటు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రయాణాల్లో మరింత ఆరోగ్య రక్షణ నిచ్చే వినూత్నమైన డ్రెస్సులను కూడా టీమిండియా ఆటగాళ్లకు అందించింది.


More Telugu News