పాఠశాలలను తెరవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం
- 9వ తరగతి ఆపై క్లాసుల విద్యార్థులకు స్కూళ్లను తెరవాలనుకున్న ప్రభుత్వం
- కరోనా నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
- తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు
ఈనెల 16 నుంచి తొమ్మిదో తరగతి, ఆపై క్లాసులకు సంబంధించిన విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలను ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ... ఎక్కువ మంది కరోనా భయాలతో స్కూళ్లను తెరవద్దని కోరారని పేర్కొంది.
రీసెర్చ్ స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.