ఎవ‌రు గెలిచారన్నది ముఖ్యం కాదు: బీహార్‌లో ఎన్డీఏ విజయంపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్య‌లు

  • మంచి చేసే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
  • ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు
  • ఈ నేపథ్యంలో మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు
  • ఐదేళ్ల త‌ర్వాత అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తులు మారాలి 
బీహార్ శాస‌న‌స‌భ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తీర్పుపై  బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్ర‌జ‌లు తమకు మంచి చేసే వారి కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

అలాగే, భారత ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారని, ఈ నేపథ్యంలో బీహార్‌లో ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలు ఒకే పార్టీకి మూడో సారి కూడా అవ‌కాశం ఇవ్వచ్చని జేడీయూని ఉద్దేశించి అన్నారు. అయితే, త‌మ జీవితాలు మరింత బాగుపడాలన్న ఉద్దేశంతోనే వారు ఈ అవ‌కాశం ఇచ్చి ఉండవచ్చని చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఎవ‌రు గెలిచారన్నది ముఖ్యం కాదని, గెలిచిన వారి పాలనలో ఐదేళ్ల త‌ర్వాత అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తులు మారాయా? అన్న విషయమే ముఖ్యమని చెప్పారు. బాగా పరిపాలన అందిస్తే  ఈ సర్కారును తాము ఎంచుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని ఐదేళ్ల అనంతరం ప్ర‌జ‌లు అనుకుంటారని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


More Telugu News