చెత్తను తరలించే పాత డొక్కు బండ్లు కొన్ని రోజుల్లో కనపడవు: కేటీఆర్
- తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ
- ప్రస్తుతం 2,000 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ
- కొన్ని రోజుల్లో 2,700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలు
- హైదరాబాద్‌లో 90 చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు
- కొత్త సంవత్సరంలో అత్యాధునిక బండ్లు
హైదరాబాద్‌లో భవనాల నిర్మాణ వ్యర్థాలను తరలించే 55 ఆధునిక స్వచ్ఛ వాహనాలను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డు వద్ద జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం 2,000 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని, కొన్ని రోజుల్లో 2,700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో 90 చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. చెత్తను తరలించే పాత డొక్కు బండ్లు కొన్ని రోజుల్లో కనబడవని, కొత్త సంవత్సరంలో అత్యాధునిక బండ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శంగా ఉందని కేటీఆర్ చెప్పారు.