స్టాక్ మార్కెట్: తొలిసారి 43 వేల పాయింట్ల ఎగువన ముగిసిన సెన్సెక్స్

  • తొలిసారి 43 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్
  • 43,593 వద్ద ముగిసిన సూచీ
  • నిఫ్టీ సైతం జీవనకాల గరిష్టాన్ని తాకిన వైనం
  • రాణించిన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 43 వేల పాయింట్ల ఎగువన ముగిసింది. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పై నమ్మకాలు బలపడడంతో పాటు బీహార్ ఎన్నికలు, పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే హవా సాగించడం నేటి ట్రేడింగ్ కు ఊపునిచ్చింది. సెన్సెక్స్ (43,708.47) జీవనకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 316 పాయింట్ల వృద్ధితో 43,593.67 వద్ద ముగిసింది.

అటు, నిఫ్టీ 118.05 పాయింట్ల పెంపుతో 12,749.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఓ దశలో ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ఓ దశలో 12,643.90 వద్ద ట్రేడయింది.

ఇవాళ్టి ట్రేడింగ్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు రాణించాయి.

అటు, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ నష్టాల పాలయ్యాయి.


More Telugu News