కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించింది: జగన్

  • బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశాం
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాం
  • ముస్లింలను అభిమానించేది వైసీపీ మాత్రమే
నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్యహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ... కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ఒక లాయర్ బెయిల్ పిటిషన్ వేశారని... బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు.

న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. ప్రభుత్వంపై కొందరు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమను చూపిస్తున్నారని... ముస్లింలను అభిమానించే పార్టీ కేవలం వైసీపీ మాత్రమేనని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే ముస్లింలను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.


More Telugu News