మమ్మల్ని అంటరాని వ్యక్తులుగా చూశారు: ఒవైసీ
- బీహార్ లో అన్ని పార్టీలనీ కలిశాం
- ఎవరూ పట్టించుకోలేదు
- మా ప్లాన్లు సరిగా వర్కౌట్ కాలేదు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని అంటరాని పార్టీగా చూశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద పార్టీలన్నీ తమను దూరం పెట్టాయని అన్నారు. బీహార్ ఎంఐఎం అధ్యక్షుడు అన్ని పార్టీలతో భేటీ అయ్యారని... కానీ, ఏ పార్టీ నాయకులు కూడా తమతో కలిసి రాలేదని చెప్పారు.
దేశంలోని పెద్ద పార్టీలన్నీ తమను అంటరానివారిగా చూశాయని అన్నారు. బీహార్ లో తమ వ్యూహాలు పూర్తి స్థాయిలో పని చేయలేదని... ఎందుకు పని చేయలేదో ఇప్పటికిప్పుడే చెప్పలేమని అన్నారు. రానున్న రోజుల్లో మంచి ప్రదర్శన కనబరుస్తామని చెప్పారు. తమ ప్లానింగ్ లో ఏదో ఒక లోపం ఉందని.... అందుకే ఊహించిన దానికంటే తక్కువ ఫలితాలు వచ్చాయని అన్నారు. తమ ఆలోచనలు సరిగ్గా వర్కౌట్ అయి ఉంటే మరిన్ని స్థానాల్లో గెలిచేవారమని చెప్పారు. కాగా, బీహార్ లో ఎంఐఎం ఐదు స్థానాలలో గెలుపొందిన విషయం తెలిసిందే!