దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు!
- టపాసులకు రెండు గంటలు మాత్రమే అనుమతి
- గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలి
- ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఆంక్షలు
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని వేళ, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని, శనివారం నాడు రాత్రిపూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని సూచించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని, రాష్ట్రంలోని కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య 10 అడుగుల దూరం తప్పనిసరని, కొనుగోలుదారులు కూడా 6 అడుగుల దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపుల యజమానులదేనని వెల్లడించింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావమున్న శానిటైజర్ లను వాడరాదని తేల్చి చెప్పింది.