రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి 8 మంది మృతి
- బస్ని పారిశ్రామిక ప్రాంతంలో ఘటన
- తీవ్రంగా గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమం
- ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గత రాత్రి నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోధ్‌పూర్‌లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిందీ ఘటన. పైకప్పుపై మెటాలిక్ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 14 మందిని శిథిలాల కింది నుంచి రక్షించగా, వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదంలో 8 మంది చనిపోవడంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారి కుటుంబాలకు 40 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. నిర్మాణం జరుగుతున్న భవనం ఇంటి యజమాని, కాంట్రాక్టర్లను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.