రఘునందన్ రావు విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన ఈసీ
- దుబ్బాకలో తెరుచుకోని నాలుగు ఈవీఎంలు
- చివరకు రెండు ఈవీఎంలను తెరిచిన అధికారులు
- రఘునందన్ కే పూర్తి ఆధిక్యత అని ప్రకటన
దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ రావు పూర్తి ఆధిక్యత సాధించినప్పటికీ చివర్లో కొంత టెన్షన్ నెలకొంది. నాలుగు ఈవీఎంలు తెరుచుకోలేదంటూ కౌంటింగ్ అధికారులు తెలపడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఏర్పడింది. అయితే రఘునందన్ గెలుపును ఈసీ ధ్రువీకరించింది.
మొరాయించిన నాలుగు ఈవీఎంలలో రెండింటిని తెరిచిన అధికారులు అందులో నమోదైన ఓట్లను లెక్కించారు. ఈ రెండు ఈవీఎంలలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 39 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో, 23 రౌండ్లు పూర్తైన తర్వాత బీజేపీకి లభించిన 1,118 ఆధిక్యత కాస్తా 1,079కి తగ్గింది. అయితే ఇంకా తెరవని రెండు ఈవీఎంలలో 897 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా ప్రత్యర్థికి పడినా... రఘునందన్ రావుకే ఆధిక్యత ఉండే నేపథ్యంలో ఆయనే గెలిచినట్టు ఈసీ ధ్రువీకరించింది.