దుబ్బాక ఓటమిపై హరీశ్ రావు స్పందన

  • దుబ్బాక ఓటమికి నాదే బాధ్యత
  • ప్రజల తీర్పును శిరసావహిస్తాం
  • దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటా
దుబ్బాక ఓటమిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఓటమికి తనదే బాధ్యత అని చెప్పారు. దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని అన్నారు. తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను సమీక్షిస్తామని, తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పారు.

ఇకపై కూడా దుబ్బాక ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు.

మరోవైపు దుబ్బాక ఉపఎన్నికను హరీశ్ తన భుజస్కందాలపై వేసుకుని శ్రమించారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అంతా తానై కష్టపడ్డారు. సోలిపేట సుజాతను గెలిపించేందుకు తన సమయాన్నంతా కేటాయించారు. అయితే, దుబ్బాక ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు విజయాన్ని కట్టబెట్టారు.


More Telugu News