బీహార్ లో ఎంఐఎం హవా.... రెండు స్థానాల్లో గెలుపు, మూడు స్థానాల్లో ఆధిక్యం

  • బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకుంటోన్న ఎంఐఎం
  • బీహార్ ట్రెండ్స్ తో మజ్లిస్ శ్రేణుల్లో ఉత్సాహం
  • బీహార్ లో ముందంజలో కొనసాగుతున్న బీజేపీ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ బీహార్ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంటోంది. బీహార్ లో ఎంఐఎం 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి, 3 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ తన ప్రాబల్యం పెంచుకోవాలని భావిస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ ట్రెండ్స్ ఎంతో ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహంలేదు.

ఇక, బీహార్ లో ఇతర పార్టీల పరిస్థితి గమనిస్తే.... బీజేపీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ 69 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. జేడీయూ 40, కాంగ్రెస్ 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు చూస్తే... బీజేపీ 2, జేడీయూ 2, ఆర్జేడీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కు ఓ స్థానం దక్కింది. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. మరో 235 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


More Telugu News