జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం: డీకే అరుణ
- రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- దుబ్బాక గెలుపే దీనికి నిదర్శనం
- టీఆర్ఎస్ ను దుబ్బాక ప్రజలు తిరస్కరించారు
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సత్తా చాటింది. అధికార టీఆర్ఎస్ ను ఓడించి...జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. దుబ్బాక గెలుపుతో బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ఎన్నికల తుది ఫలితం వెల్లడైన తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ గెలుపే నిదర్శనమని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. బీజేపీ పట్ల విశ్వాసం ఉంచి, గెలిపించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని అన్నారు.