దుబ్బాకలో ఆశించిన ఫలితం రాలేదు.. నాయకులకు ఈ ఫలితం ఒక హెచ్చరిక వంటిది: కేటీఆర్
- రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం
- ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటాం
- భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటాం
గత ఆరున్నరేళ్లుగా ప్రతి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయాలు సాధిస్తూనే వచ్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. విజయాలతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం టీఆర్ఎస్ కు అలవాటు లేదని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటు వేసిన 61,320 మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే దానిపై అందరం కలిసి సమీక్షించుకుంటామని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
దుబ్బాక ఉపఎన్నికలో తాము ఆశించిన ఫలితం రాలేదని చెప్పిన కేటీఆర్... ఇది పార్టీ నేతలందరికీ ఒక హెచ్చరిక వంటిదని అన్నారు. నాయకులందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.