తొమ్మిదో రౌండులో కూడా బీజేపీదే ఆధిక్యత.. 4 వేల మెజార్టీని దాటిన రఘునందన్ రావు
- తొమ్మిదో రౌండులో బీజేపీకి 1,084 ఓట్ల ఆధిక్యత
- మొత్తంమీద 4,190 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్న బీజేపీ
- నిరాశలో కాంగ్రెస్ శిబిరం
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ లో ఆరు, ఏడు రౌండ్లలో వెనుకబడిన బీజేపీ మళ్లీ పుంజుకుంది. వరుసగా ఎనిమిది, తొమ్మిది రౌండ్లలో ఆధిక్యతను సాధించింది. తొమ్మిదో రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఏకంగా 1,084 ఓట్ల మెజార్టీని సాధించారు. తొమ్మిదో రౌండులో బీజేపీకి 3,413 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 2,329 ఓట్లు వచ్చాయి.
మొత్తంమీద బీజేపీకి ఇప్పటి వరకు 29,291 ఓట్లు, టీఆర్ఎస్ కు 25,101 ఓట్లు, కాంగ్రెస్ కు 5,800 ఓట్లు పడ్డాయి. తొమ్మిదో రౌండు ముగిసే సరికి రఘునందన్ రావు 4,190 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మరోవైపు, గెలుపు తమదేనని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ శిబిరం నిరాశలో మునిగిపోయింది.